xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
దేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరందేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం

ఆంధ్రప్రదేశ్

రైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం
ఆంధ్రప్రదేశ్

రైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ రైల్వే డివిజన్ ఆడిటోరియంలో రైల్వే పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల సౌకర్యార్థం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ -డీఎల్‌సీ శిబిరం గురువారం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 156 డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను జారీ చేశారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించడంతో పాటు, ఫింఛన్ సంబంధిత సమస్యలపై రైల్వే అధికారుల నుంచి సహాయం పొందేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రైల్వే వైద్య విభాగం ఆధ్వర్యంలో పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

06-11-2026 14:41
పంట నష్టంపై  కేంద్రమంత్రి పెమ్మసాని
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై కేంద్రమంత్రి పెమ్మసాని

ఆంధ్రప్రదేశ్ లో తుపాను వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతిన్న రైతులకు తగిన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించి, తుఫాను కారణంగా జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. బాధిత రైతులకు ప్రభుత్వ సహాయం అందించేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

06-11-2026 14:40
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని మండలాల్లో వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరగనుంది. వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని మండలాల్లో వాయిదా పడిన పోలింగ్‌ను శుక్రవారం నిర్వహించనున్నారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో పోలింగ్ జరగనుంది. గురువారం జరగాల్సిన పోలింగ్‌ను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. కాగా, ఎంపీటీసీ,e జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం చేపట్టనున్నారు.

06-11-2026 14:36
తుపాను  సహాయక చర్యలపై ముఖ్యమంత్రి  సమీక్ష
ఆంధ్రప్రదేశ్

తుపాను సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష

ఆంధ్రప్రదేశ్ లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, రహదారులు, తాగునీటి సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుపాను నష్టాలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి అమరావతిలో ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్యుత్, రహదారులు, తాగునీరు తదితర రంగాల్లో జరిగిన నష్టాన్ని అధికారులు వివరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తుపాను బాధితులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించి కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శుక్రవారం పర్యటించి క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించనున్నారు.

06-11-2026 14:35
పలు చోట్ల రీపోలింగ్
ఆంధ్రప్రదేశ్

పలు చోట్ల రీపోలింగ్

ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అనంతరపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల గ్రామంలో 8వ పోలింగ్ కేంద్రం, పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామంలో 46 మరియు 47 వ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే కర్నూలు జిల్లా అర్లబండ గ్రామంలోని 2 వ పోలింగ్ కేంద్రంలో, శ్రీకాకుళం జిల్లాలోని పొన్నం గ్రామంలోని 2 వ పోలింగ్ కేంద్రంలో, పల్నాడు జిల్లా అండుగురు గ్రామంలోని 43 పోలింగ్ కేంద్రంలో, మార్కాపురం జిల్లా గంగవరం గ్రామంలోని 5 వ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్ జరగనుంది.

06-11-2026 14:33
📰
ఆంధ్రప్రదేశ్

అగ్నిపథ్ పథకంలో చారిత్రాత్మక సవరణలకు కేంద్రం ఆమోదం

త్రివిధ దళాల అవసరాలు, దేశ రక్షణ భద్రత, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకంలో చారిత్రాత్మక సవరణలకు ఆమోదం తెలిపిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ తెలిపారు.

06-11-2026 14:26
📰
ఆంధ్రప్రదేశ్

తమిళనాడు మత్స్యకారుల మృతదేహాలను గుర్తించిన కుటుంబ సభ్యులు

ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో లభ్యమైన తమిళనాడు మత్స్యకారుల మృతదేహాలను గుర్తించేందుకు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎన్. మేరీ విల్సన్ గురువారం రాత్రి ఒంగోలుకు చేరుకున్నారు.

06-11-2026 14:26
కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
ఆంధ్రప్రదేశ్

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

ఈ నెల 7వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.

06-11-2026 14:26
📰
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి గురువారం సందర్శించి పరిశీలించారు.

05-11-2026 15:49
📰
ఆంధ్రప్రదేశ్

ఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.

05-11-2026 15:49
📰
ఆంధ్రప్రదేశ్

వృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజు

ఎన్నికల విధుల్లో భాగంగా గన్నవరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజు మానవత్వాన్ని చాటుకున్నారు.

05-11-2026 15:49
📰
ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

ఓటు హక్కు భారత ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పించిన గొప్ప వరమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు.

05-11-2026 15:49

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.