xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
దేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరందేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం

జాతీయం

దేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
జాతీయం

దేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

న్యూఢిల్లీలో 'డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0'ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. పెన్షనర్లు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే సులభంగా జీవిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో సీనియర్ సిటిజన్ల ఆర్థిక భద్రత కీలకమని, పెన్షన్ అదాలత్‌ల ద్వారా సేవలను మరింత వేగవంతం చేశామని పేర్కొన్నారు.

06-11-2026 15:56
📰
జాతీయం

పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదల

భారత్‌లో నివసిస్తున్న పలు కేటగిరీల విదేశీయులు, శరణార్థులకు కేంద్రం పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించింది. నేపాల్, భూటాన్ ప్రయాణాలకు గుర్తింపు కార్డు ఉంటే పాస్‌పోర్ట్ అవసరం లేదని స్పష్టం చేసింది. 2015 లోపు వచ్చిన శ్రీలంక తమిళులు, 2024 లోపు వచ్చిన మూడు పొరుగు దేశాల మైనారిటీలు, గుర్తింపు కార్డులు లేని కొందరు పాక్ పౌరులకు మినహాయింపులు ఇస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

06-11-2026 15:21
దేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
జాతీయం

దేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా ధన్‌తేరస్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. లక్ష్మీదేవి, ధన్వంతరి పూజలతో పాటు బంగారం, వాహనాల కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడాయి. ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

06-11-2026 15:20
టెక్నాలజీ స్కోర్‌బోర్డు
జాతీయం

టెక్నాలజీ స్కోర్‌బోర్డు

పరిశోధన, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్‌ హెచ్‌. పురుషోత్తం కోరారు. ఢిల్లీలో నీతి ఆయోగ్‌ నిర్వహించిన ఇండియా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్కోర్‌బోర్డు ప్రారంభోత్సవంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల సైన్స్ అండ్ టెక్నాలజీ స్కోర్‌బోర్డులో గ్లోబల్‌ ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లను చేర్చాలని సూచించారు. పరిశోధనా సంస్థలను బలోపేతం చేయడంతోపాటు పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు. పరిశోధన ఫలితాలను ఆచరణలోకి తీసుకురావడం ద్వారా సాంకేతిక అభివృద్ధికి మరింత చేయూత లభిస్తుందని పురుషోత్తం పేర్కొన్నారు.

04-11-2026 11:28
గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం.. 83 పునరావాస శిబిరాలు ఏర్పాటు
జాతీయం

గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం.. 83 పునరావాస శిబిరాలు ఏర్పాటు

మురసు తుపాను ఈ రోజు రాత్రికి కావలి–ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

02-11-2026 14:42
ఖేత్ బచావో అభియాన్ - రబీ 2026.. నేల ఆరోగ్యం, సుస్థిర వ్యవసాయంపై దేశవ్యాప్త ప్రచారం
జాతీయం

ఖేత్ బచావో అభియాన్ - రబీ 2026.. నేల ఆరోగ్యం, సుస్థిర వ్యవసాయంపై దేశవ్యాప్త ప్రచారం

భారతదేశంలో నేల సారాన్ని పెంచేందుకు 34 రాష్ట్రాల పరిధిలోని 700 జిల్లాల్లో ‘ఖేత్ బచావో అభియాన్ - రబీ 2026’ ముమ్మరంగా సాగుతోంది. 4,150 బృందాలు, 12,000 మంది శాస్త్రవేత్తలతో 50 లక్షల మంది రైతులకు సమతుల్య ఎరువుల వాడకం, సహజ వ్యవసాయం, జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువుల సాగుపై అవగాహన కల్పిస్తూ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు.

02-11-2026 14:39
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో నూతన వాయుసేన చీఫ్ అశుతోష్ దీక్షిత్ భేటీ
జాతీయం

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో నూతన వాయుసేన చీఫ్ అశుతోష్ దీక్షిత్ భేటీ

భారత వైమానిక దళ నూతన అధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. దీక్షిత్ విశిష్ట నాయకత్వ లక్షణాలు కలిగిన ప్రతిభావంతుడైన ఎయిర్ వారియర్ అని రక్షణ మంత్రి ప్రశంసిస్తూ, ఆయన పదవీ కాలం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.

02-11-2026 14:39
హర్యానా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జాతీయం

హర్యానా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో జరిగిన హర్యానా 60వ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. కురుక్షేత్ర పుణ్యభూమి గొప్పతనాన్ని, స్వాతంత్ర్య సమరయోధులైన రావు తులారామ్, దీనబంధు ఛోటూరామ్, కాన్షీరామ్ త్యాగాలను కొనియాడారు.

02-11-2026 09:49
📰
జాతీయం

ఇండి కూటమి చేపట్టిన నిరసనల్లో పాల్గొనండి.. షాపింగ్ కూడా చేయండి: రాహుల్ గాంధీ

దిల్లీ రాంలీలా మైదానంలో ఇండి కూటమి చేపట్టిన మెగా ర్యాలీకి వచ్చే ప్రజలు నిరసనలతో పాటు స్థానిక చిన్న దుకాణాల్లో షాపింగ్ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పండుగల వేళ ర్యాలీ వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. స్థానిక వ్యాపారులకు మద్దతుగా కొనుగోళ్లు జరపాలని కోరారు.

02-11-2026 09:49
సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులు
జాతీయం

సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులు

భారతరత్న సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం సర్దార్‌ పటేల్‌ చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయమని గవర్నర్‌ పేర్కొన్నారు. భారతదేశాన్ని ఏకం చేసి, అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. వల్లభాయ్ పటేల్ ఆశయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ప్రతి ఏటా అక్టోబర్ 31న 'రాష్ట్రీయ ఏక్తా దివస్' జరుపుకుంటున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ తదితరులు వలభ్ బాయ్ పటేల్ కు నివాళులర్పించారు.

31-10-2026 13:59
సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
జాతీయం

సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

భారతరత్న సర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ 151వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ఉన్న ఐక్యతా విగ్రహం వద్ద ఈ ఉదయం ఘనంగా నివాళులర్పించారు. విగ్రహం పాదాల చెంత పుష్పాంజలి ఘటించారు. జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏక్తా నగర్‌లో 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పర్యావరణహిత రవాణా సదుపాయాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రెండు ఆధునిక బస్సులు, రెండు విద్యుత్‌ బస్సులను ప్రారంభించారు. పరిశుభ్రమైన, పర్యావరణహిత ఏక్తా నగర్‌ నిర్మాణంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన 20 ఈ-వ్యర్థాల సేకరణ వాహనాలను ప్రారంభించారు. ఆధునిక మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో నూతన ఐఆర్‌సీటీసీ హోటల్‌ను కూడా ప్రారంభించారు.

31-10-2026 13:58
📰
జాతీయం

రెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి నవంబర్ 1 వరకు రెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈరోజు మహారాష్ట్రలోని నాసిక్, త్రయంబకేశ్వర్ వేదికలుగా ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక సింహస్థ కుంభమేళాకు రాష్ట్రపతి హాజరుకానున్నారు. నాసిక్‌లోని పవిత్ర రామ్‌కుండ్ వద్ద జరిగే ధ్వజస్తంభ పూజ, ధ్వజారోహణ కార్యక్రమాలలో పాల్గొని, కుంభమేళా పరిపాలనాపరమైన, ఆధ్యాత్మిక సన్నాహాలను ఆమె అధికారికంగా ప్రారంభిస్తారు.

31-10-2026 12:51

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.