పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో పచ్చిగుడ్లతో తయారుచేసే మయోనైజ్‌పై నిషేధాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతంలో బంజారాహిల్స్‌లో మోమోస్ తిని మహిళ మృతి చెందిన ఘటనలో మయోనైజ్ వల్లే ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు తేలడంతో తొలుత ఏడాది నిషేధం విధించారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఆ నిషేధాన్ని మరో ఏడాది పాటు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.






