xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలుమహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు
Motilal Oswal - Jangareddigudem

ముఖ్య వార్త

మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ
ఆంధ్రప్రదేశ్

మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనక దుర్గమ్మ వారు మహాలక్ష్మీ దేవి అలంకారంలో ఈ రోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి వివరాలు అందజేస్తారు. ఇది ఇలా ఉండగా శ్రీశైల మహక్షేత్రంలో దసరా మహోత్సవాలలో భాగంగా భ్రమరాంబికాదేవి అమ్మవారు గత రాత్రి కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈ రోజు వెన్నముద్దల బతుకమ్మను ఆరాధించనున్నారు.

17-10-2026 10:51

మరిన్ని వార్తలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ10:42

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కొత్తగూడెం ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీకి కోల్‌ ఇండియా సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి వంద కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని, తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సత్తుపల్లి-3 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలన్నారు. హైదరాబాదులో కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించారు.

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు
ఆంధ్రప్రదేశ్10:40

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు

దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ – విశాఖపట్నం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ రోజు విశాఖపట్నం - విజయవాడ మధ్య, ఎల్లుండి విజయవాడ - విశాఖపట్నంల మధ్య జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించింది. మరోవైపు ఈ రోజు, రేపు విజయవాడ - పలాస.. రేపు, ఎల్లుండి పలాస - విజయవాడ మధ్య జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

అత్యంత వైభవంగా  గరుడ వాహనసేవ
ఆంధ్రప్రదేశ్10:39

అత్యంత వైభవంగా గరుడ వాహనసేవ

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గత రాత్రి గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాలధారిగా శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవలో స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనం అందించారు.

మూడు నెలల్లో ‘రోహిత్‌ వేముల తెలంగాణ బిల్లు’ ముసాయిదా
తెలంగాణ10:38

మూడు నెలల్లో ‘రోహిత్‌ వేముల తెలంగాణ బిల్లు’ ముసాయిదా

మూడు నెలల్లో ‘రోహిత్‌ వేముల తెలంగాణ బిల్లు’ ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీచేశారు. హైదరాబాదులోని సచివాలయంలో ఉపముఖ్యమంత్రి అధ్యక్షతన రోహిత్‌ వేముల తెలంగాణ బిల్లుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ శాఖ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతిపాదిత బిల్లు రూపకల్పనకు అనుసరించాల్సిన విధానం, కమిటీ కూర్పు, న్యాయపరమైన అంశాలు, వివిధ వర్గాలతో సంప్రదింపుల ప్రక్రియపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం
ఆంధ్రప్రదేశ్17:20

స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి. నిషాంతి శుక్రవారం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

📰
తెలంగాణ17:18

సింగరేణి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్▶

సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం బోనస్ చెల్లించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ... సంస్థ వాస్తవ లాభాలను బయటపెట్టాలని, కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

రహదారి ప్రమాదాలు, మాదకద్రవ్యాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
ఆంధ్రప్రదేశ్17:18

రహదారి ప్రమాదాలు, మాదకద్రవ్యాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్

మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రహదారి ప్రమాదాల నివారణతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు
ఆంధ్రప్రదేశ్17:18

స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు

పార్వతీపురం మన్యం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు–2026ను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు.

పుట్టపర్తిలో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఆంధ్రప్రదేశ్16:39

పుట్టపర్తిలో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

రాబోయే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా తొలిరోజు శుక్రవారం పుట్టపర్తి పట్టణంలోని ఎనుములపల్లి బీసీ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎ. శ్యామ్ ప్రసాద్ స్వయంగా తనిఖీ చేశారు.

ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు సమగ్ర శిక్షణ
ఆంధ్రప్రదేశ్16:39

ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు సమగ్ర శిక్షణ

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్‌ఓలు), ఇతర అధికారులకు శుక్రవారం పుట్టపర్తి ఎండీఓ కార్యాలయంలో సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం.. నీటిని పొదుపుగా వాడాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ16:28

ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం.. నీటిని పొదుపుగా వాడాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఎల్‌నినో విపత్తును అందరం కలిసి సమైక్యంగా ఎదుర్కొందామని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జలాశయాల్లో 460 టీఎంసీలకు గాను కేవలం 209 టీఎంసీలే ఉన్నాయని, 251 టీఎంసీల నీటి కొరత ఉందని ఆయన తెలిపారు. నీళ్లను కొనుక్కోలేం కాబట్టి ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. తాగునీటికే మొదటి ప్రాధాన్యమివ్వాలని, యాసంగిలో రైతులు వరి సాగును తగ్గించుకోవాలని కోరారు. నీటిని వృథా చేయకుండా ప్రతి చుక్కను ఆదా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కష్టకాలంలో కేంద్రం 60:40 నిష్పత్తిలో నిధులతో రాష్ట్రానికి పూర్తి సహాయం అందించాలని సీఎం కోరారు.

ఎల్‌నినో పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం వాయిదా
తెలంగాణ16:27

ఎల్‌నినో పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం వాయిదా

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం వల్ల తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై ఇవాళ రాష్ట్ర సచివాలయంలో జరగాల్సిన అఖిలపక్ష సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం తిరిగి ఎప్పుడు నిర్వహించనున్నారనే విషయాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరువు పరిస్థితులు: కేటీఆర్
తెలంగాణ16:24

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరువు పరిస్థితులు: కేటీఆర్

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలను సరిగ్గా వాడుకోకుండా వృథాగా దిగువకు వదిలేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, ఎల్ నినో హెచ్చరికలను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.

బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక: కిషన్‌రెడ్డి
తెలంగాణ16:22

బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక: కిషన్‌రెడ్డి

హైదరాబాద్, బంజారాహిల్స్‌ లోని సాగర్ సొసైటీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. పూలను పూజించే ఈ అద్భుత వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, తన తరఫున ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. గౌరమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు చేకూరాలని, ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

వీడియో వార్తలు

లోక్‌భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు
తెలంగాణ

లోక్‌భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు

లోక్ భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని గవర్నర్ తెలిపారు. దాదాపు 400 మంది మహిళలు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొని జానపద పాటలు, కోలాటాలతో అలరించారు.

16-10-2026 16:22
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రుల ప్రత్యేక పూజలు
తెలంగాణ

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రుల ప్రత్యేక పూజలు

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనగా, ఈ అంశంపై రాజకీయం చేయకుండా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.

16-10-2026 16:21
కరీంనగర్ మహాశక్తి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
తెలంగాణ

కరీంనగర్ మహాశక్తి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

కరీంనగర్ జిల్లాలోని శ్రీ మహాశక్తి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విద్యార్థుల అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలతో ఆలయం కోలాహలంగా మారగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ సహా పలువురు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

16-10-2026 16:20
వేములవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రారంభం
తెలంగాణ

వేములవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజుతో కలిసి ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఉదయం మున్సిపల్ కార్యాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

16-10-2026 16:20
నల్లగొండలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ

నల్లగొండలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ ఎంతో విశిష్టమైనదని పేర్కొన్న ఆయన, జిల్లా ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

16-10-2026 16:19
బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: వరంగల్‌ జీడబ్ల్యూఎంసీ కమిషనర్
తెలంగాణ

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: వరంగల్‌ జీడబ్ల్యూఎంసీ కమిషనర్

సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేసి, ఉత్సవ ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.

16-10-2026 16:19

ఆంధ్రప్రదేశ్

అన్ని వార్తలు →
ప్రకాశం జిల్లాలో స్థానిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లాలో స్థానిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.

16-10-2026 15:48
మూలా నక్షత్రం సందర్భంగా నూజివీడు సరస్వతీ అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ఆంధ్రప్రదేశ్

మూలా నక్షత్రం సందర్భంగా నూజివీడు సరస్వతీ అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

16-10-2026 14:17
స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

16-10-2026 14:17
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.

16-10-2026 14:17
భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి
జాతీయం

భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి

భారతరత్న, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈ రోజు . 1931 అక్టోబరు 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం, దాదాపు నాలుగు దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, సైనిక క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి భారత మిస్సైల్ మ్యాన్‌గా గుర్తింపు పొందారు. 1998లో నిర్వహించిన పోఖ్రాన్-2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది.

15-10-2026 09:55
రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక...
జాతీయం

రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక...

దసరా, దీపావళి పండుగల వేళ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని 'ఉత్పాదకతతో ముడిపడిన బోనస్' (PLB) రూపంలో చెల్లించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 11.40 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

15-10-2026 09:52
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతికి భారత్, ఆసియాన్ భాగస్వామ్యం:  రాజ్‌నాథ్ సింగ్
జాతీయం

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతికి భారత్, ఆసియాన్ భాగస్వామ్యం: రాజ్‌నాథ్ సింగ్

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం భారత్, ఆసియాన్ దేశాలు కలిసి పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆసియాన్-ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ, సముద్ర భద్రత, విపత్తు నిర్వహణలో సంయుక్త ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు.

15-10-2026 09:52
జాతీయ సామాజిక సహాయ పథకం పొడిగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం
జాతీయం

జాతీయ సామాజిక సహాయ పథకం పొడిగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం

గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించిన జాతీయ సామాజిక సహాయ పథకాన్ని (ఎన్ఎస్ఏపీ) 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 53,428 కోట్ల రూపాయల వ్యయం కానుంది. ఈ నిర్ణయంతో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 3.20 కోట్ల మంది ప్రయోజనం పొందుతారు.

15-10-2026 09:46
📰
జాతీయం

ప్రాంతీయ భద్రతకు BIMSTEC అత్యంత కీలకం: హోం మంత్రుల సదస్సులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఢిల్లీలో నిర్వహించిన తొలి BIMSTEC హోం మంత్రుల సదస్సులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. ప్రాంతీయ సమగ్రత, ఆర్థిక సహకారం, ఉమ్మడి భద్రత కోసం బిమ్‌స్టెక్ కీలక వేదికగా మారిందని పేర్కొన్నారు. శాంతి, మానవ సంక్షేమానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

13-10-2026 14:40
సీజేఐపై వివాదాస్పద పోస్టు, సుప్రీంకోర్టులో నిరసనలపై కోర్టు ధిక్కార పిటిషన్
జాతీయం

సీజేఐపై వివాదాస్పద పోస్టు, సుప్రీంకోర్టులో నిరసనలపై కోర్టు ధిక్కార పిటిషన్

భారత ప్రధాన న్యాయమూర్తిపై అనుచిత పోస్టు చేసిన కేరళ కాంగ్రెస్‌తో పాటు, కోర్టు ప్రాంగణంలో నిరసనలకు దిగిన ఇండి కూటమి నేతలపై సుమోటో కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని న్యాయవాది వినీత్ జిందాల్ సీజేఐని కోరారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ ఘటనలపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

13-10-2026 14:40

అంతర్జాతీయం

అన్ని వార్తలు →
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలపై జెలెన్స్కీ అభ్యంతరం
అంతర్జాతీయం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలపై జెలెన్స్కీ అభ్యంతరం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రష్యా నుంచి డీజిల్ సరఫరాపై ఆంక్షల సడలింపు, శుద్ధి కేంద్రాలపై దాడులు ఆపాలన్న సూచనలను తప్పుపట్టారు. యుద్ధంలో అమెరికా తటస్థంగా ఉండాలని కోరారు.

15-10-2026 12:32
హార్ముజ్ జలసంధిలో పెరుగుతున్న దాడులు.. మునిగిన 2 నౌకలు
అంతర్జాతీయం

హార్ముజ్ జలసంధిలో పెరుగుతున్న దాడులు.. మునిగిన 2 నౌకలు

హార్ముజ్ జలసంధి వద్ద రవాణా నౌకలపై దాడులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో జరిగిన 2 వేర్వేరు ఘటనల్లో జీఎఫ్‌ఎస్ ప్రైడ్, కేప్ డావో నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. కేప్ డావో నౌక మునిగిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ దాడులు ముమ్మరం చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

15-10-2026 12:32
హర్మూజ్‌లో సీమైన్‌ను ఢీకొని ముగిగిన చమురు ట్యాంకర్
అంతర్జాతీయం

హర్మూజ్‌లో సీమైన్‌ను ఢీకొని ముగిగిన చమురు ట్యాంకర్

హర్మూజ్ జలసంధిలో మందుపాతరను (సీమైన్) ఢీకొని ఒక చమురు ట్యాంకర్ మునిగిపోయింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా జలసంధి గుండా ప్రయాణించవద్దని ఇరాన్ ప్రపంచ దేశాలను హెచ్చరించింది.

15-10-2026 09:46
ఉగ్రవాదాన్ని 'మానవత్వానికి వ్యతిరేక నేరం'గా పరిగణించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ స్పష్టీకరణ
అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని 'మానవత్వానికి వ్యతిరేక నేరం'గా పరిగణించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ స్పష్టీకరణ

మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాల నిరోధక అంతర్జాతీయ ఒప్పందంలో ఉగ్రవాదాన్ని తప్పనిసరిగా చేర్చాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ పిలుపునిచ్చింది. ఐరాస లీగల్ కమిటీ సమావేశంలో భారత కౌన్సెలర్ ఆర్. మైథిలి మాట్లాడుతూ.. ఉగ్రవాద చర్యలు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల కిందకే వస్తాయని, బాధితులకు న్యాయం చేసేందుకు దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూనే అంతర్జాతీయ నిబంధనలను రూపొందించాలని పేర్కొన్నారు.

13-10-2026 10:59
ఇరాన్‌కు రష్యా, చైనా మద్దతు ఇవ్వడం లేదు:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అంతర్జాతీయం

ఇరాన్‌కు రష్యా, చైనా మద్దతు ఇవ్వడం లేదు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌కు చైనా, రష్యాలు సహకరిస్తున్నాయన్న ప్రచారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇరాన్‌కు మద్దతిస్తే ఆ రెండు దేశాలే తీవ్రంగా నష్టపోతాయని, ఒకవేళ అలాంటి సాయమేదైనా జరిగితే తమకు వెంటనే తెలిసిపోతుందని ఆయన స్పష్టం చేశారు.

13-10-2026 10:58
జిబౌటి తీరంలో వలసదారుల పడవ మునక: 15 మంది చిన్నారులు సహా 139 మంది మృతి
అంతర్జాతీయం

జిబౌటి తీరంలో వలసదారుల పడవ మునక: 15 మంది చిన్నారులు సహా 139 మంది మృతి

ఆఫ్రికా దేశంలోని జిబౌటి తీరంలో 305 మంది ప్రయాణికులతో వెళ్తున్న వలసదారుల పడవ మునిగిపోయిన ఘటనలో 15 మంది పిల్లలతో సహా 139 మంది మరణించారని అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) ప్రకటించింది. మరో 84 మంది గల్లంతయ్యారు. రక్షించిన 80 మందికి పైగా ఇథియోపియన్ బాధితులకు ఆశ్రయం, వైద్య సాయం అందిస్తున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రమాదకర మార్గంలో సామర్థ్యానికి మించి ప్రయాణించడమే ఈ ప్రమాదానికి కారణం.

12-10-2026 11:42
రాహుల్ గాంధీ డ్రామాలు కొనసాగుతున్నాయి - కిరణ్ రిజిజు
రాజకీయాలు

రాహుల్ గాంధీ డ్రామాలు కొనసాగుతున్నాయి - కిరణ్ రిజిజు

రాజ్యాంగ వ్యవస్థలను రాహుల్ గాంధీ నిత్యం లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని, అలాగే కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు లభించదని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.

07-10-2026 09:59
📰
రాజకీయాలు

పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ధి

పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన ‘ది ఎర్త్ సెంటర్ – విష్టా స్పేసెస్’ భవనాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పర్యావరణానికి నష్టం కలగకుండా పర్యావరణహిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణాల్లో సౌర విద్యుత్, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అమరావతిని పర్యావరణహిత నగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేశారు.

23-09-2026 05:30
నటుడు నాని ట్వీట్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్షన్.. పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని సూచన
సినిమా

నటుడు నాని ట్వీట్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్షన్.. పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని సూచన

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 'ది ప్యారడైజ్' సినిమా వీక్షణకు అనుమతి కోరిన నటుడు నాని విజ్ఞప్తిపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొంటూనే, సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు శాంతిభద్రతల దృష్ట్యా స్థానిక పోలీసులను ఆశ్రయించి అధికారిక అనుమతి తీసుకోవాలని చిత్ర బృందానికి సూచించారు.

23-09-2026 14:49
📰
సినిమా

జాతీయ చలనచిత్ర పురస్కారాలు –రాష్ట్రపతి

భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలు, సామాజిక అనుభవాలను ప్రతిబింబించడంలో చలన చిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సాయంత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చలనచిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతాయన్నారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో చలన చిత్రాలు సహాయపడతాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నకేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. విజేతలకు అభినందనలు తెలుపుతూ.. తెర వెనుక పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, సినిమాటోగ్రాఫర్లు ఇతర సభ్యుల కృషిని ప్రశంసించారు. భవిష్యత్‌లో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలుగా తమ తమ ప్రాంతాలలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశాన్ని గుర్తించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అశ్వినీ వైష్ణ‌వ్‌ ఆహ్వానం పలికారు.

23-09-2026 05:30
📰
సినిమా

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్-ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు, చిత్రాలకు రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమనటులుగా మమ్ముట్టి, కార్తిక్‌ ఆర్యన్‌ పురస్కారాన్ని అందుకోగా, ఉత్తమ నటి పురస్కారాన్ని యామీ గౌతమ్‌ అందుకున్నారు. ఇక తెలుగు చలనచిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో ‘35 చిన్న కథ కాదు’ సినిమాకి అరుణ్‌ దేవ్‌, ఉత్తమ సంభాషణలు విభాగంలో ‘లక్కీ భాస్కర్‌’ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన ‘కల్కి 2898 ఏడీ’చిత్రానికి దర్శకులు నాగ్‌ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు.

23-09-2026 05:30
📰
సినిమా

పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి సంధ్యారాణి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

21-09-2026 12:00
ఆసియా క్రీడల విజేతలతో నేడు ప్రధాని మోదీ భేటీ
క్రీడలు

ఆసియా క్రీడల విజేతలతో నేడు ప్రధాని మోదీ భేటీ

ఆసియా క్రీడలు 2026లో పాల్గొన్న భారతీయ క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ముచ్చటించనున్నారు. జపాన్‌లో జరిగిన ఈ పోటీల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది.

15-10-2026 12:32
నాలుగో టీ20లో భారత్‌పై వెస్టిండీస్ విజయం
క్రీడలు

నాలుగో టీ20లో భారత్‌పై వెస్టిండీస్ విజయం

భారత్‌కు వెస్టిండీస్ జట్ల మద్య హైదరాబాద్‌లో నిన్న రాత్రి జరిగిన నాలుగో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ రెండు-రెండుతో సమమైంది. 248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 19.3 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఇక ఈ సిరీస్‌లో నిర్ణయాత్మకమైన ఐదో టీ20 మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

15-10-2026 09:53
టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ మెరుగైన స్థానాలకు చేరారు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా, శ్రేయస్ అయ్యర్ 4వ ర్యాంకుకు ఎగబాకారు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రిషభ్ పంత్ 7వ స్థానంలో నిలిచారు.

15-10-2026 09:52
సిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
క్రీడలు

సిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రగుడు మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు.

12-10-2026 15:58
2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమే లక్ష్యంగా భారత్ ప్రయాణం: ప్రధాని మోదీ
క్రీడలు

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమే లక్ష్యంగా భారత్ ప్రయాణం: ప్రధాని మోదీ

2036లో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే బృహత్తర స్వప్నంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఆయన, రక్షణ, ఇంజనీరింగ్ రంగాల్లో దేశం సాధించిన రికార్డులను వివరించారు.

12-10-2026 10:27
కామన్వెల్త్ గేమ్స్ పవర్లిఫ్టింగ్‌లో స్వర్ణ పతక విజేత కృపారావుకు ఎమ్మెల్యే వసంత అభినందనలు
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్ పవర్లిఫ్టింగ్‌లో స్వర్ణ పతక విజేత కృపారావుకు ఎమ్మెల్యే వసంత అభినందనలు

కామన్వెల్త్ గేమ్స్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిచెప్పిన ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సంకు కృపారావును మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు అభినందించారు.

09-10-2026 14:33
ఉపాధ్యాయులకు ఏఐ ఆధారిత బోధనపై శిక్షణ
విద్య

ఉపాధ్యాయులకు ఏఐ ఆధారిత బోధనపై శిక్షణ

ఆసిఫాబాద్ జిల్లాలోని ఎంపిక చేసిన 68 పాఠశాల ఉపాధ్యాయులకు కృత్రిమ మేధా ఆధారిత అభ్యసన నమూనాలపై జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి సచితానంద చారి ప్రారంభించారు.

30-09-2026 14:31
నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత
విద్య

నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత

దేశంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన "ది కాన్‌క్లేవ్ 2026" కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.

29-09-2026 09:51
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం
విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం

ప్రభుత్వం విద్యా, వైద్యం రంగాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో కూడా కార్పోరేట్ స్థాయి విద్యను అందించాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. వెల్టూరు గ్రామంలో 12 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు, 10 కోట్ల రూపాయలతో నిర్మాంచనున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు మరో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువు నీటిలో చేప పిల్లలను వదిలారు.

28-09-2026 17:04
సిరిసిల్లలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు
విద్య

సిరిసిల్లలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయ్యిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

26-09-2026 12:51
51 వేల మందికి నియామక పత్రాలు అందజేత
విద్య

51 వేల మందికి నియామక పత్రాలు అందజేత

దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రోజ్‌గార్ మేళా’ ఇవాళ మరోసారి ప్రారంభమైంది.

23-09-2026 05:30
📰
విద్య

ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్

శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుందని ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ అన్నారు. మహారాష్ట్రలోని లోనావాలాలో గల కైవల్యధామంలోని గోర్ధన్‌దాస్ సెక్సరియా కాలేజ్ ఆఫ్ యోగా అండ్ కల్చరల్ సింథసిస్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఉప‌రాష్ట్ర‌ప‌తి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యోగా కేవలం ఒక తరానికి చెందిన సంప్రదాయం కాదని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం దీనిని పరిరక్షించాల్సిన వారసత్వ సంపదగా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం ద్వారా యోగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని ఉపరాష్ట్రపతి తెలిపారు.

23-09-2026 05:30
దేశీయ మార్కెట్‌లో తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

దేశీయ మార్కెట్‌లో తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,500కు చేరగా, కిలో వెండి ధర రూ.2,13,800కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలే ఈ తగ్గుదలకు కారణమని విశ్లేషకులు తెలిపారు.

15-10-2026 12:54
తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధర రూ.1,52,250
బిజినెస్

తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధర రూ.1,52,250

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,290 తగ్గి రూ.1,52,250కి చేరగా, కిలో వెండి ధర రూ.2,881 తగ్గి రూ.2,25,885 వద్ద స్థిరపడింది.

13-10-2026 14:40
📰
బిజినెస్

దేశీయ స్టాక్‌ మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు నష్టాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఎఫ్‌ఐఐల విక్రయాలు, అమెరికాలో బాండ్‌ రాబడులు పెరగడం, చమురు ధరల పెరుగుదల మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ఒక దశలో 1200 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌‌, ఆఖర్లో కొంత కోలుకుని 570 పాయింట్ల నష్టంతో ముగిసింది.

02-10-2026 09:38
సెప్టెంబర్ 27 (ఆదివారం) రోజున బ్యాంకులు పనిచేస్తాయి
బిజినెస్

సెప్టెంబర్ 27 (ఆదివారం) రోజున బ్యాంకులు పనిచేస్తాయి

ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున, ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం సెప్టెంబర్ 27వ తేదీన జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు.

25-09-2026 14:51
📰
బిజినెస్

ఎండీఎల్ తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌లోని దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్‌ షిప్‌యార్డ్‌ ఏర్పాటు చేసేందుకు ‘మజగావ్ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌’ (ఎండీఎల్‌)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి సచివాలయంలో ఎండీఎల్‌, ‘నేషనల్‌ షిప్‌బిల్డింగ్‌ అండ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ పార్క్‌-ఏపీ’ (ఎన్‌ఎస్‌హెచ్‌ఐపీ-ఏపీ) మధ్య అవగాహన ఒప్పందం ఈరోజు జరిగింది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుపై ఎండీఎల్‌ సుమారు 15 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. షిప్‌బిల్డింగ్‌తో పాటు మెరైన్‌ ఇంజినీరింగ్‌, లాజిస్టిక్స్‌, సర్వీసులు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

23-09-2026 05:30
📰
బిజినెస్

బులియన్ మార్కెట్

గతవారంలో స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో మళ్లీ పెరిగాయి. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన పసిడి ఫ్యూచర్స్ ధర గతవారంలో ఒక శాతం పెరిగి 10 గ్రాములకు ల‌క్షా 54 వేల 381 రూపాయ‌ల‌ వద్ద ముగిసింది. మరొకవైపు డిసెంబర్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన వెండి ఫ్యూచర్స్ ధర 2.8 శాతం పెరిగి కిలో గ్రాము 2 ల‌క్ష‌ల 41 వేల 603 రూపాయ‌ల వద్ద స్థిరపడింది.

23-09-2026 05:30
రసాయన శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ పురస్కారం
టెక్నాలజీ

రసాయన శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ పురస్కారం

2026 రసాయన శాస్త్ర నోబెల్ బహుమతిని శాస్త్రవేత్తలు హెన్రీ కాగన్, కెన్సో సోవాయిలకు సంయుక్తంగా ప్రకటించారు. అసమాన సేంద్రీయ సంశ్లేషణలో ఆటోకెటాలసిస్, నాన్-లీనియర్ ఎఫెక్ట్స్‌ను కనుగొన్నందుకు ఈ అవార్డు దక్కింది. విజేతలు సంయుక్తంగా 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్ల నగదు పురస్కారాన్ని అందుకోనున్నారు.

08-10-2026 09:40
భౌతిక శాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జెన్‌ కు నోబెల్ బహుమతి
టెక్నాలజీ

భౌతిక శాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జెన్‌ కు నోబెల్ బహుమతి

భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్‌ బహుమతిని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్ ప్రకటించింది. విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ భౌతికశాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్‌‌ను ఈ అత్యున్నత పురస్కారం వరించింది.

07-10-2026 09:59
సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ప్రారంభం
వ్యవసాయం

సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ప్రారంభం

వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. బాపట్లలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 5 కోట్లతో నిర్మించిన సాంకేతిక పరిజ్ఞాన కేంద్రాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. కరవు మండలాల్లో రబీ పంట కాలానికి రైతులకు రాయితీ విత్తనాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు

06-10-2026 09:38
📰
వ్యవసాయం

రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి మంగళవారం తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నదుల అనుసంధానం ద్వారా నీటి భద్రత సాధించవచ్చని అన్నారు. రైతులకు ఉపయోగపడేలా ఆధునిక పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు.

23-09-2026 05:30

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.