xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
దేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరందేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం

బిజినెస్

📰
బిజినెస్

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 905 పాయింట్లు పెరిగి 74,151 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 184 పాయింట్లు లాభపడి 22,882 వద్ద ముగిసింది.

30-10-2026 09:49
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
బిజినెస్

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మెటల్, ఫార్మా రంగాల మద్దతుతో సెన్సెక్స్ 482 పాయింట్లు పెరిగి 73,606 వద్ద, నిఫ్టీ 22,753 పాయింట్ల వద్ద ముగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలోనూ కొనుగోళ్ల ఉత్సాహం కనిపించగా, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్ రాణించాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ నష్టాలను చవిచూశాయి.

27-10-2026 09:46
📰
బిజినెస్

వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రోజంతా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి.

24-10-2026 09:52
📰
బిజినెస్

ద్రవ్యోల్బణ భయాలు... వరుసగా మూడో రోజు నష్టాల్లో మార్కెట్లు

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 460.30 పాయింట్లు నష్టపోయి 73,249.39 వద్ద, నిఫ్టీ 123.70 పాయింట్లు తగ్గి 22,687.65 వద్ద స్థిరపడ్డాయి.

23-10-2026 09:45
దేశీయ మార్కెట్‌లో తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

దేశీయ మార్కెట్‌లో తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,500కు చేరగా, కిలో వెండి ధర రూ.2,13,800కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలే ఈ తగ్గుదలకు కారణమని విశ్లేషకులు తెలిపారు.

15-10-2026 12:54
తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధర రూ.1,52,250
బిజినెస్

తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధర రూ.1,52,250

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,290 తగ్గి రూ.1,52,250కి చేరగా, కిలో వెండి ధర రూ.2,881 తగ్గి రూ.2,25,885 వద్ద స్థిరపడింది.

13-10-2026 14:40
📰
బిజినెస్

దేశీయ స్టాక్‌ మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు నష్టాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఎఫ్‌ఐఐల విక్రయాలు, అమెరికాలో బాండ్‌ రాబడులు పెరగడం, చమురు ధరల పెరుగుదల మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ఒక దశలో 1200 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌‌, ఆఖర్లో కొంత కోలుకుని 570 పాయింట్ల నష్టంతో ముగిసింది.

02-10-2026 09:38
సెప్టెంబర్ 27 (ఆదివారం) రోజున బ్యాంకులు పనిచేస్తాయి
బిజినెస్

సెప్టెంబర్ 27 (ఆదివారం) రోజున బ్యాంకులు పనిచేస్తాయి

ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున, ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం సెప్టెంబర్ 27వ తేదీన జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు.

25-09-2026 14:51
📰
బిజినెస్

ఎండీఎల్ తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌లోని దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్‌ షిప్‌యార్డ్‌ ఏర్పాటు చేసేందుకు ‘మజగావ్ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌’ (ఎండీఎల్‌)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి సచివాలయంలో ఎండీఎల్‌, ‘నేషనల్‌ షిప్‌బిల్డింగ్‌ అండ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ పార్క్‌-ఏపీ’ (ఎన్‌ఎస్‌హెచ్‌ఐపీ-ఏపీ) మధ్య అవగాహన ఒప్పందం ఈరోజు జరిగింది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుపై ఎండీఎల్‌ సుమారు 15 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. షిప్‌బిల్డింగ్‌తో పాటు మెరైన్‌ ఇంజినీరింగ్‌, లాజిస్టిక్స్‌, సర్వీసులు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

23-09-2026 05:30
📰
బిజినెస్

బులియన్ మార్కెట్

గతవారంలో స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో మళ్లీ పెరిగాయి. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన పసిడి ఫ్యూచర్స్ ధర గతవారంలో ఒక శాతం పెరిగి 10 గ్రాములకు ల‌క్షా 54 వేల 381 రూపాయ‌ల‌ వద్ద ముగిసింది. మరొకవైపు డిసెంబర్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన వెండి ఫ్యూచర్స్ ధర 2.8 శాతం పెరిగి కిలో గ్రాము 2 ల‌క్ష‌ల 41 వేల 603 రూపాయ‌ల వద్ద స్థిరపడింది.

23-09-2026 05:30
చేనేత రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత
బిజినెస్

చేనేత రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత

చేనేత రంగం అభివృద్ధి, నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు.

23-09-2026 05:30
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ముడిచమురు ధరల తగ్గుదల నేపథ్యంలో సోమవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 564 పాయింట్లు లాభపడి 74,858 వద్ద, నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 23,414 వద్ద ముగిశాయి. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలు రాణించగా.. మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు నష్టపోయాయి. క్రూడాయిల్ ధర తగ్గడంతో రూపాయి విలువ 95.81 వద్ద ముగిసింది.

22-09-2026 12:52

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.