xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఇరాన్ యుద్ధం కారణంగానే రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోయారని జేడీ వాన్స్ వ్యాఖ్యలు – భారీగా పడిపోయిన చమురు ధరలువిద్యుత్ కొరత, ఖానామెట్‌లో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవితపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లిఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారంవృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజుఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ఇరాన్ యుద్ధం కారణంగానే రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోయారని జేడీ వాన్స్ వ్యాఖ్యలు – భారీగా పడిపోయిన చమురు ధరలువిద్యుత్ కొరత, ఖానామెట్‌లో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవితపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లిఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణ స్వీకారంవృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజుఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
తెలంగాణ

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క

04-11-2026 16:15
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క
తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన ఫిక్కీ @100 వేడుకలు, తెలంగాణ డీప్‌టెక్ లీడర్‌షిప్ సమ్మిట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో డీప్‌టెక్, సాంకేతిక ఆవిష్కరణలు కీలక పాత్ర పోషించాలని, పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఉత్పత్తులుగా మారాలని అన్నారు. సాఫ్ట్‌ వేర్, ఫార్మా, బయోటెక్, ఏరోస్పేస్ రంగాల సమన్వయంతో హైదరాబాద్‌లో అపార అవకాశాలున్నాయన్నారు. యువ స్టార్టప్‌లకు ఉమ్మడి పరీక్షా కేంద్రాలు, సులభతర ధ్రువీకరణ విధానాలు అందుబాటులోకి రావాలని సూచించారు. అంతకుముందు ఫిక్కీ చైర్మన్ వివిఆర్ రాజు, FTCCI అధ్యక్షులు కేకే మహేశ్వరి, ఫిక్కీ మాజీ అధ్యక్షులు డాక్టర్ సంగీతారెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
xPress24, HYDERABAD, November 4,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.