ఆంధ్రప్రదేశ్
23 పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు చర్యలు
24-10-2026 10:04

ఆంధ్రప్రదేశ్ లోని 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించి, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు అవసరమైన ప్రక్రియను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ను ఆమోదించింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులను నిన్న జారీ చేసింది. ఈ 23 పట్టణ స్థానిక సంస్థల్లో నాలుగు నగర పాలక సంస్థలు, 19 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు ఉన్నాయి. ఆయా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు, ముసాయిదా జాబితాల తయారీ, అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ, వాటి పరిష్కారం, క్షేత్రస్థాయి పరిశీలన, తుది జాబితాల ఖరారు, ప్రచురణకు సంబంధించి రోజువారీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
xPress24, Amaravathi, October 24,