xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేకృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
జాతీయం

50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు : ప్రధాని మోదీ

19-11-2026 14:50
50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు : ప్రధాని మోదీ
దేశంలో 50 కోట్ల మందిని తమ ప్రభుత్వం పేదరికం నుంచి బయటడేసిందని ప్రధాని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.
xPress24, Hyderabad, November 19, 1970వ దశకంలో గరీబీ హటావో నినాదం ఇచ్చినప్పుడు దేశ జనాభా 50 కోట్లుగా ఉండేదని, అప్పట్లో విధానాల్లో లోపాలు, సరైన సంకల్పం లేకపోవడం వల్లే పేదరిక నిర్మూలన సాధ్యం కాలేదని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  విమర్శించారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే నేడు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన  ప్రసంగిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.  ప్రపంచంలోనే నేడు  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని  మోదీ అన్నారు.  భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు వచ్చే 20ఏళ్లపాటు ప్రతి దీర్ఘకాలిక పెట్టుబడి నిర్ణయాల్లో భారత్ తొలి ప్రాతిపదిక కావాలని మోదీ సూచించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను మరింత పెంచాలని పారిశ్రామిక రంగానికి పిలుపునిచ్చారు. అలాగే గత 12 ఏళ్లలో యువత, రైతులు, కార్మికులు, పారిశ్రామికవేత్తల కృషితో ఆర్థిక స్థితిని పురోగమణంలోకి తీసుకొచ్చామన్నారు.  అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవడం ఎంతో అవసరమని, ఈ సూత్రం వ్యక్తులకు, పరిశ్రమలకు, దేశానికి వర్తిస్తుందని మోదీ స్పష్టం చేశారు.  అలాగే, రైతులు, పరిశ్రమలు, పన్ను చెల్లింపుదారులను గౌరవించినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా ఎదుగుతుందన్న అన్నారు. మన దేశ ఆర్థిక పురోగతిని చూసి ప్రపంచ బ్యాంకు, మూడీస్, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థలు వృద్ధి అంచనాలను మరింత పెంచుతున్నాయని  మోదీ వివరించారు. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 7 నాటికి ఫిక్కీ ఏర్పడి 100 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో, 2026-27 సంవత్సరాన్ని ఫిక్కీ శతాబ్ది సంవత్సరంగా నిర్వహిస్తున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.