xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
విద్య

51 వేల మందికి నియామక పత్రాలు అందజేత

23-09-2026 05:30
51 వేల మందికి నియామక పత్రాలు అందజేత
దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రోజ్‌గార్ మేళా’ ఇవాళ మరోసారి ప్రారంభమైంది.
xPress24, Hyderabad, September 20, దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రోజ్‌గార్ మేళా’ ఇవాళ మరోసారి ప్రారంభమైంది. ఇది 20వ విడత రోజ్‌గార్ మేళా కార్యక్రమం. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు నియామక పత్రాలను అందజేశారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు సాధించిన 51,000 మందికి పైగా అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందించారు. రైల్వే శాఖ, హోం శాఖ, రెవెన్యూ, రక్షణ, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలతో పాటు పలు కీలక శాఖల్లో ఈ నియామకాలు చేపట్టారు. దేశవ్యాప్తంగా మొత్తం 45 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, వారిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం రోజ్‌గార్ మేళాను నిర్వహిస్తోంది. ఈ తాజా నియామకాలతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 12.75 లక్షల మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించారు. నూతనంగా ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ, దేశ నిర్మాణంలో వారి పాత్ర ఎంతో కీలకమని ఈ వేదికగా గుర్తుచేసుకున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.