జాతీయం
GSLV F-18 రాకెట్ ప్రయోగం విజయవంతం
31-10-2026 12:51
శ్రీహరికోటలో ఇస్రో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విజయవంతమయ్యింది. నావిగేషన్ వ్యవస్థ బలోపేతానికి ఎన్‌వీఎస్- 03 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించింది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. NVS ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ F-18 ద్వారా నింగిలోకి ప్రయోగించారు.
xPress24, Hyderabad, October 31,
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో శుక్రవారం రాత్రి 11:51 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా NVS-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది. ఉపగ్రహం రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి నిర్దేశిత జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి చేరినట్లు ఇస్రో వెల్లడించింది. భారతీయ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ కింద సేవలను నిరంతరం కొనసాగించేందుకు రూపొందించిన తర్వాతి తరహా ఉపగ్రహ శ్రేణిలో ఇది మూడవది.
ఈ ఉపగ్రహంలో స్వదేశీ అటామిక్ క్లాక్‌తో పాటు కొనుగోలు చేసిన అటామిక్ క్లాక్‌లను కూడా అమర్చారు. ఇప్పటికే ఉన్న ఎల్5, ఎస్-బ్యాండ్ సిగ్నల్స్‌తో పాటు అదనంగా 'ఎల్1' నావిగేషన్ సిగ్నల్‌ను పొందుపరిచారు. దీనివల్ల భారత్‌తో పాటు సరిహద్దుల నుంచి వెలుపలికి 1,500 కిలోమీటర్ల పరిధిలో నావిగేషన్ సేవలు మరింత విస్తృతమవుతాయని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ తెలిపారు.
బైట్: డాక్టర్ వి. నారాయణన్, ఇస్రో చైర్మన్