ఆంధ్రప్రదేశ్
అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి: కలెక్టర్
18-11-2026 10:01

విజయనగరం జిల్లాలో ఎక్కడా అక్రమ మైనింగ్ జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.
xPress24, Vizianagaram, November 17,
విజయనగరం, నవంబర్ 17:
విజయనగరం జిల్లాలో ఎక్కడా అక్రమ మైనింగ్ జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కల్పించకూడదని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణాతో పాటు అనధికార తవ్వకాలను కూడా సమర్థవంతంగా అరికట్టాలని సూచించారు. ముఖ్యంగా తాగునీటి పథకాల సమీపంలో ఇసుక తవ్వకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మట్టి, కంకరను అక్రమంగా తవ్వి తరలిస్తున్నట్లు వివిధ మాధ్యమాల ద్వారా తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను తక్షణమే నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.