తెలంగాణ
అగ్ని ప్రమాదాలపై సజ్జనార్ కీలక సూచనలు
26-11-2026 11:58

అగ్నిప్రమాదాల నివారణకు ఐపీఎస్ అధికారి సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌తో మంటలను ఆర్పడం వల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలమన్నారు. ఇళ్లలో, కార్యాలయాల్లో ఐఎస్ఐ మార్క్ ఉన్న ఫైర్ ఎక్స్‌టింగ్విషనర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
xPress24, Hyderabad, November 25,
అగ్నిప్రమాదాలను నివారణకు ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ ఎక్స్ వేదికగా కీలక సూచనలు చేశారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌తో మంటలను అదుపు చేయాలని తెలిపారు. అలా చేయడం వల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలమన్నారు. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ని ఎలా వాడాలో కుటుంబ సభ్యులు అందరికీ తెలియడం ఎంతో ముఖ్యమని.. ఇళ్లు, కార్యాలయాల్లో ఐఎస్ఐ మార్క్ ఉన్న ఫైర్ ఎక్స్‌టింగ్విషనర్లను అందుబాటులో ఉంచుకోవాలని, వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయించాలని సూచించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే 101 లేదా 112 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.