ఆంధ్రప్రదేశ్
అగ్నిపథ్ పథకంలో చారిత్రాత్మక సవరణలకు కేంద్రం ఆమోదం
06-11-2026 14:26
త్రివిధ దళాల అవసరాలు, దేశ రక్షణ భద్రత, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకంలో చారిత్రాత్మక సవరణలకు ఆమోదం తెలిపిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ తెలిపారు.
xPress24, Vijayawada, November 6,
విజయవాడ: త్రివిధ దళాల అవసరాలు, దేశ రక్షణ భద్రత, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకంలో చారిత్రాత్మక సవరణలకు ఆమోదం తెలిపిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ తెలిపారు.
విజయవాడలో ఆయన మాట్లాడుతూ, భారత రక్షణ రంగంలో అగ్నిపథ్ పథకం పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో భారత సైన్యంలో అనుభవజ్ఞులైన, కఠిన శిక్షణ పొందిన యువ సిబ్బంది అందుబాటులో ఉంటారని, అదే సమయంలో దేశ రక్షణ సేవల్లో కొనసాగాలని ఆకాంక్షించే యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
రక్షణ దళాల పోరాట సామర్థ్యాన్ని మరింత పెంపొందించడంలో ఈ మార్పులు మైలురాయిగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. నిబంధనలకు అనుగుణంగా అగ్నివీరులకు త్రివిధ దళాల్లో శాశ్వత ఉద్యోగం పొందే అవకాశాలను కల్పించడంలో ఈ నిర్ణయం దోహదపడుతుందని అన్నారు. అగ్నివీరులను సాయుధ దళాల్లో కొనసాగించే అవకాశాలు పెరగడం సైన్యానికి, యువతకు ఉభయతారకంగా ఉంటుందని షేక్ బాజీ పేర్కొన్నారు.