xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'
అంతర్జాతీయం

అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల

19-11-2026 09:49
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 806 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లీ 757 రేటింగ్స్‌తో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విఫలమైన రోహిత్ శర్మ ఒక స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోయాడు.
xPress24, Dubai, November 18, అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 806 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లీ 757 రేటింగ్స్‌తో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విఫలమైన రోహిత్ శర్మ ఒక స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోయాడు. అఫ్గానిస్థాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్  బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో19వ స్థానంలో నిలిచాడు. మరోవైపు కేఎల్ రాహుల్ 11వ స్థానానికి చేరుకోగా, శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ 10వ స్థానం లోకి అడుగుపెట్టాడు. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 778 రేటింగ్స్‌తో 2వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో సెంచరీ బాదిన ఇంగ్లాండ్ బ్యాటర్ టామ్ బాంటన్ 13వ ర్యాంక్ సాధించాడు. అర్ధశతకంతో రాణించిన ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ 9వ స్థానంలో నిలిచాడు.  ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్‌లలో రెండు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 7 స్థానానికి చేరాడు. న్యూజిలాండ్ పేసర్లు మాట్ హెన్రీ 12వ స్థానానికి, కైల్ జేమీసన్ 45వ స్థానానికి చేరుకున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.