ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభ
12-11-2026 16:57

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మెరకచింత పంచాయతీ పరిధిలోని రంగసింగిపాడు గ్రామానికి చెందిన వలస నాయిని రావని దృష్టిలోపాన్ని అధిగమించి అంతర్జాతీయ క్రీడా వేదికపై భారతదేశానికి, అల్లూరి జిల్లాకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ నీశాంతి కొనియాడారు.
xPress24, Paderu, November 12,
పాడేరు, నవంబర్ 12:
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మెరకచింత పంచాయతీ పరిధిలోని రంగసింగిపాడు గ్రామానికి చెందిన వలస నాయిని రావని దృష్టిలోపాన్ని అధిగమించి అంతర్జాతీయ క్రీడా వేదికపై భారతదేశానికి, అల్లూరి జిల్లాకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ నీశాంతి కొనియాడారు.
పుట్టుకతోనే దృష్టిలోపం ఉన్న ముగ్గురు ఆడపిల్లల కుటుంబంలో పెద్ద కుమార్తె అయిన రావని, ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసం, పట్టుదల, కఠోర శ్రమతో విజయాలను సాధించడం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
2023లో అంతర్జాతీయ బ్లైండ్ క్రికెట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి విజయాన్ని అందుకున్న రావని, అనంతరం అథ్లెటిక్స్‌లోనూ తన ప్రతిభను చాటుకుంది. ఇటీవల జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో 400 మీటర్లు, 1500 మీటర్ల పరుగు పందెం విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి తన అంకితభావం, క్రీడా నైపుణ్యాన్ని నిరూపించుకుందని కలెక్టర్ ప్రశంసించారు.