జాతీయం
అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం
20-11-2026 11:22

గోవాలో 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం - ఇఫీ 2026 శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభం కానుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఫెస్టివల్ డైరెక్టర్, ప్రముఖ చిత్రనిర్మాత అశుతోష్ గోవారికర్‌తో కలిసి తొమ్మిది రోజుల సినీ వేడుకలను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది ‘సరిహద్దులులకు అతీతంగా కథల ప్రపంచం’ అనే ఇతివృత్తంతో చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 86 దేశాల నుంచి వచ్చిన 150కి పైగా అంతర్జాతీయ చిత్రాలను ఈ ఉత్సవంలో ప్రదర్శించనున్నారు. పోలిష్ దర్శకుడు పావెల్ పావ్లికోవ్స్కీ తెరకెక్కించిన ‘ఫాదర్‌ల్యాండ్’ ప్రారంభ చిత్రంగా ప్రదర్శితం కానుంది. సింగపూర్ దర్శకులు ఆంథోనీ చెన్ రూపొందించిన ‘వి ఆర్ ఆల్ స్ట్రేంజర్స్’ ముగింపు చిత్రంగా నిలవనుంది.ఈ ఉత్సవంలో చిత్ర ప్రదర్శనలతో పాటు మాస్టర్‌క్లాస్‌లు, వర్క్‌షాప్‌లు, చర్చలు, ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
xPress24, Panaji, November 20,