xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నంసూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నం
సినిమా

అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం - IFFI

24-11-2026 11:38
అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం - IFFI
భారతీయ ప్రసార రంగ సంస్థ ప్రసార భారతి నిర్వహించిన తొలి స్క్రిప్ట్ పిచింగ్ ల్యాబ్‌ ‘పేజ్ సే పిచ్ తక్’ విజేతలను ఈరోజు ప్రకటించనున్నారు. గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం - IFFI వేదికగా ప్రసార భారతి ఛైర్మన్ ప్రసూన్ జోషి అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 1,016 దరఖాస్తులు అందగా, వాటిలో 30 కథలను తుది పోటీకి ఎంపిక చేశారు. మూడు రోజుల పాటు ప్రముఖ జ్యూరీ ముందు రచయితలు తమ కథలను వినిపించారు. విజేతకు ఐదు లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు బంగారు అవార్డు, ద్వితీయ విజేతకు మూడు లక్షల రూపాయలు, తృతీయ విజేతకు రెండు లక్షల రూపాయలు అందిస్తారు. మరో ముగ్గురికి ప్రత్యేక ప్రశంసా పురస్కారాలతో పాటు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. కొత్త రచయితలను ప్రోత్సహించడం, దేశవ్యాప్తంగా ఉన్న కథలను జాతీయ ప్రసార మాధ్యమం ద్వారా ప్రజలకు చేరువ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రసార భారతి తెలిపింది.
xPress24, Amaravathi, November 24, భారతీయ ప్రసార రంగ సంస్థ ప్రసార భారతి నిర్వహించిన తొలి స్క్రిప్ట్ పిచింగ్ ల్యాబ్‌ ‘పేజ్ సే పిచ్ తక్’ విజేతలను ఈరోజు ప్రకటించనున్నారు. గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం - IFFI వేదికగా ప్రసార భారతి ఛైర్మన్ ప్రసూన్ జోషి అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 1,016 దరఖాస్తులు అందగా, వాటిలో 30 కథలను తుది పోటీకి ఎంపిక చేశారు. మూడు రోజుల పాటు ప్రముఖ జ్యూరీ ముందు రచయితలు తమ కథలను వినిపించారు. విజేతకు ఐదు లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు బంగారు అవార్డు, ద్వితీయ విజేతకు మూడు లక్షల రూపాయలు, తృతీయ విజేతకు రెండు లక్షల రూపాయలు అందిస్తారు. మరో ముగ్గురికి ప్రత్యేక ప్రశంసా పురస్కారాలతో పాటు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. కొత్త రచయితలను ప్రోత్సహించడం, దేశవ్యాప్తంగా ఉన్న కథలను జాతీయ ప్రసార మాధ్యమం ద్వారా ప్రజలకు చేరువ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రసార భారతి తెలిపింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.