తెలంగాణ
అంతర్జాతీయ వాతావరణ సదస్సు
10-11-2026 10:08

హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్ సమిట్‌లో భాగంగా అంతర్జాతీయ వాతావరణ సదస్సు నిర్వహించనున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.సదస్సు ఏర్పాట్లపై హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న గ్లోబల్ సమిట్‌లో భాగంగా రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సన్నద్ధత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం పెంపు, హరిత పెట్టుబడులు సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటాయని మంత్రి తెలిపారు. కరవు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవడం, వ్యవసాయం, భద్రత, జీవనోపాధి అంశాలపై సదస్సులో చర్చించాలని సూచించారు
xPress24, Hyderbad, November 10,