xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేకృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
తెలంగాణ

అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు: ములుగు జిల్లా సివిల్ సప్లై అధికారి ఫైజల్ హుస్సేన్

20-11-2026 09:52
ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు బియ్యం విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా సివిల్ సప్లై అధికారి ఫైజల్ హుస్సేన్ హెచ్చరించారు. జిల్లాలో రెండు చోట్ల ధరల పట్టికలను ఏర్పాటు చేశామని, బీపీటీ రూ. 66, తెలంగాణ సోనా రూ. 74, హెచ్ఎంటీ, జై శ్రీరామ్ బియ్యం రూ. 79 చొప్పున విక్రయించాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ జీవిత బీమా పథకం కోసం రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచించారు.
xPress24, ములుగు, November 19, ప్రభుత్వం సూచించిన ధరల కంటే అధిక ధరలకు బియ్యం విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా సివిల్ సప్లై అధికారి ఫైజల్ హుస్సేన్ హెచ్చరించారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేయకుండా నియంత్రించేందుకు అధికారులు జిల్లాలో రెండు చోట్ల బియ్యం ధరల పట్టికలను ఏర్పాటు చేశారు. బియ్యం విక్రయాల్లో వ్యాపారులు పారదర్శకత పాటించాలని, కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా నిల్వ ఉంచినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచన వినియోగదారులు బియ్యం కొనుగోలు చేసే సమయంలో సివిల్ సప్లై శాఖ ఏర్పాటు చేసిన ధరల పట్టికను పరిశీలించాలని ఫైజల్ హుస్సేన్ సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీపీటీ బియ్యం కిలో రూ. 66, తెలంగాణ సోనా రూ. 74, హెచ్ఎంటీ, జై శ్రీరామ్ బియ్యం రూ. 79 చొప్పున విక్రయించాలని తెలిపారు. వ్యాపారులు అధిక ధరలు వసూలు చేసినా, 26 కిలోల బస్తా అని చూపించి తూకంలో తక్కువ ఇచ్చినా అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఇందిరమ్మ జీవిత బీమా పథకం లబ్ధి పొందేందుకు రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని, ఇందుకోసం సమీపంలోని సివిల్ సప్లై కార్యాలయాల్లో సంప్రదించాలని ఆయన సూచించారు. బైట్స్ ఫైజల్ హుస్సేన్, ములుగు జిల్లా సివిల్ సప్లై అధికారి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.