ఆంధ్రప్రదేశ్
అనంతపురం 30వ డివిజన్లో నేడు రీపోలింగ్
02-11-2026 12:07

అనంతపురం నగరంలోని 30వ డివిజన్లోని 3వ పోలింగ్ బూత్‌లో సోమవారం రీపోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు.
xPress24, Anantapur, November 2,
అనంతపురం, నవంబర్ 2:
అనంతపురం నగరంలోని 30వ డివిజన్లోని 3వ పోలింగ్ బూత్‌లో సోమవారం రీపోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. సదరు డివిజన్‌కు చెందిన ఓటర్లు రీపోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఆదివారం రాత్రి స్థానిక ఎస్ఎస్బీఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని ఆయన వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగిందన్నారు. అయితే అనంతపురం నగరంలోని 30వ డివిజన్లోని 3వ పోలింగ్ బూత్‌లో కొన్ని కారణాల వల్ల పోలింగ్‌కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఆ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.