ఆంధ్రప్రదేశ్
అమిత్ షాకు ముఖ్యమంత్రి లేఖ
04-11-2026 10:52

వరుస తుపాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తక్షణ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఓర్నబ్ తుఫాను ప్రభావం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే మురసు తుపాను కారణంగా పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయని వివరించారు. మురసు తుపాను వల్ల రాష్ట్రంలోని ఎనిమిది శాఖలకు సంబంధించి ప్రాథమికంగా 343 కోట్ల 95 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. తుపాను నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపినందుకు అమిత్ షాకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్, సాగునీటి వనరులకు జరిగిన నష్టంపై సమగ్ర అంచనాలు రూపొందించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు.
xPress24, Amaravati, November 4,