xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!
తెలంగాణ

అమీన్‌పూర్‌లో ఘనంగా టీజీ ఎస్పీఎఫ్ రైజింగ్ డే పరేడ్

23-10-2026 14:17
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో టీజీ ఎస్పీఎఫ్ 36వ రైజింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై జవాన్ల గౌరవ వందనం స్వీకరించి, భద్రతా వ్యవస్థల ప్రాధాన్యతను వివరించారు.
xPress24, sangareddy, October 23, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్‌లో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీ ఎస్పీఎఫ్) 36వ రైజింగ్ డే పరేడ్ ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని, 36వ బ్యాచ్ ఎస్పీఎఫ్ జవాన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. డిజి స్వాతి లక్రా సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కవాతులో జవాన్లు ప్రదర్శించిన క్రమశిక్షణ, నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సమగ్ర అభివృద్ధికి పటిష్ట భద్రతే పునాది పరేడ్ మైదానంలో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో పటిష్టమైన రక్షణ, భద్రతా వ్యవస్థలే సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 67 ప్రముఖ రంగ సంస్థలకు 2000 మందికి పైగా ఎస్పీఎఫ్ సిబ్బంది నిరంతరం అంకితభావంతో రక్షణ కల్పిస్తున్నారని కొనియాడారు. గత 35 ఏళ్లలో భద్రతా రంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో భద్రత పటిష్టం మారిన కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేశామని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి అహర్నిశలు కాపలా కాస్తున్న జవాన్లతో పాటు, వారికి అండగా నిలుస్తున్న కుటుంబ సభ్యుల మనోధైర్యాన్ని ఉపముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. బైట్ - మల్లు భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.