ఆంధ్రప్రదేశ్
అమరావతిలో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
10-11-2026 15:25
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది.
xPress24, Amaravati, November 10,
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో SIPB ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నంలో జరగనున్న 'CII భాగస్వామ్య సదస్సు–2026' నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.