xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ
తెలంగాణ

అమరవీరుల దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ

24-10-2026 11:50
అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.
xPress24, Adilabad, October 24, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. కలెక్టర్ చౌరస్తా నుండి ప్రారంభమైన క్యాండిల్ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో ఎస్పీ, అదనపు ఎస్పీలతో పాటు 250 మంది పోలీసు సిబ్బంది, 50 మంది డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. "అమరవీరులకు జోహార్లు" అంటూ వారు చేసిన నినాదాలతో పట్టణం మార్మోగింది. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. నాటి పోలీసుల త్యాగాల ఫలితంగానే నేడు సమాజంలో ప్రశాంత వాతావరణం నెలకొందని స్పష్టం చేశారు. మావోయిస్టులు, టెర్రరిస్టులు, సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వీరుల త్యాగాలను గుర్తుచేసుకోవడానికి ఏటా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు పోలీసు సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు పి. మౌనిక, బి. సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డితో పాటు పలువురు సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.