xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డిఅయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యం

21-10-2026 17:42
శరీరంలో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు తలెత్తడంతో పాటు, పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుందని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) నరేష్ కుమార్ తెలిపారు.
xPress24, Srikakulam, October 21, శ్రీకాకుళం, అక్టోబర్ 21: శరీరంలో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు తలెత్తడంతో పాటు, పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుందని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) నరేష్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అయోడైజ్డ్ ఉప్పునే వినియోగించాలని సూచించారు. జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంలో భాగంగా బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా గర్భిణులు, ఎదుగుతున్న పిల్లలకు అయోడిన్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. అయోడిన్ లోపం వల్ల గొంతు వాపు (గాయిటర్) వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నెల 27వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పాఠశాలల్లోనూ విద్యార్థులకు అయోడిన్ ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో వెల్లడించారు. ప్రజలు అయోడిన్ లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన పెంచుకుని, అయోడైజ్డ్ ఉప్పును వినియోగించాలని సూచించారు.

🎥 వీడియో

అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యం

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.