ఆంధ్రప్రదేశ్
అర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులు
27-10-2026 09:47

అర్నాబ్ తుపాను ప్రభావం దృష్ట్యా ఏలూరు జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 27, 28 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
xPress24, Eluru, October 26,
ఏలూరు, అక్టోబర్ 26: అర్నాబ్ తుపాను ప్రభావం దృష్ట్యా ఏలూరు జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 27, 28 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
తుపాను ప్రభావం నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలు, అధికారులు ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.