xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
తెలంగాణ

అర్నాబ్ తుఫాన్ ప్రభావం.. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు

30-10-2026 09:52
అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజులు చల్లని గాలులతో చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నందున రైతులు పంటల పట్ల జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ సూచించింది.
xPress24, Adilabad, October 29, బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాన్ ప్రభావం ఆదిలాబాద్ జిల్లాపై కనిపిస్తోంది. అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. రోజంతా ముసురుపట్టి జల్లులు పడటంతో పాటు ఆకాశం మేఘావృతమై చీకట్లు కమ్ముకున్నాయి. కొద్దిరోజులుగా ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉష్ణోగ్రతలు తగ్గి చల్లటి వాతావరణం నెలకొనడం ఊరటనిచ్చింది. వర్షపాతం వివరాలు జిల్లాలో సగటున 17.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బేల మండలంలో 11.5 మి.మీ. నమోదు కాగా, తాంసి మండలంలో 3.5 మి.మీ., ఇంద్రవెల్లిలో 2.8 మి.మీ., మావల మండలంలో 2.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. రైతులు జాగ్రత్తలు వహించాలి తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సూచించారు. కోతకు వచ్చిన, ఇప్పటికే కోసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరో 2 రోజులు చల్లని గాలులతో కూడిన చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని, పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనులు చేపట్టాలని వెల్లడించారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.