ఆంధ్రప్రదేశ్
‘అర్నాబ్’ తుఫాను ప్రభావం.. పలు రైళ్లు రద్దు, రీషెడ్యూల్, దారి మళ్లింపు
30-10-2026 17:06

'అర్నాబ్' తుఫాను ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేయడం, వేళలను మార్చడం, మళ్లించడం చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సిఎస్టి ముంబై-భువనేశ్వర్ రైలు రద్దవగా, సికింద్రాబాద్, చార్లపల్లి నుంచి షాలిమార్ వెళ్లే రైళ్లతో పాటు హౌరా, భువనేశ్వర్ రైళ్లను రీషెడ్యూల్ చేశారు. హౌరా-తిరుచిరాపల్లి రైలును టాటానగర్ మీదుగా మళ్లించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచించారు.
xPress24, HYDERABAD, October 30,