ఆంధ్రప్రదేశ్
అర్నబ్ తుఫాన్ ప్రభావం.. రహదారిపై పడిన భారీ చెట్టు తొలగింపు
30-10-2026 09:51

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పాలకొండ డివిజన్ పరిధిలోని జమ్మడగూడ గ్రామం వద్ద దొనుభాయి నుంచి సీతంపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై పడిపోయిన భారీ చెట్టును అధికారులు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
xPress24, Paravathipuram, October 29,
పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 29:
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పాలకొండ డివిజన్ పరిధిలోని జమ్మడగూడ గ్రామం వద్ద దొనుభాయి నుంచి సీతంపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై పడిపోయిన భారీ చెట్టును అధికారులు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
భారీ చెట్టు రహదారిపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పాలకొండ సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్డీపీఓ) ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఆయన పర్యవేక్షణలో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు.
అవసరమైన పరికరాలతో రంగంలోకి దిగిన సిబ్బంది వేగంగా చెట్టును తొలగించి రహదారిపై అడ్డంకిని పరిష్కరించారు. దీంతో ట్రాఫిక్ పునరుద్ధరించగా, ప్రస్తుతం వాహనాల రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన అధికారులను, సిబ్బందిని స్థానికులు అభినందించారు.