xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిస్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలుపర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డిప్రపంచ శాంతికి సాంస్కృతిక బంధాలే బలమైన హామీ: ప్రధాని మోదీఅరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ

అరవపల్లిలో ఇందిరమ్మ జీవిత పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్

21-11-2026 12:30
అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రజలను కోరారు. సూర్యాపేట జిల్లా అరవపల్లి గ్రామంలో ఈ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
xPress24, Suryapet, November 21, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం గ్రామగ్రామాన విస్తరిస్తోంది. కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా అండగా నిలవడమే  ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ పథకాన్ని.. నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించేందుకు అమలు చేస్తోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అరవపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మందుల సామేల్ ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబం కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని తమ ప్రభుత్వం గుర్తించిందని, అందుకే ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంతో పాటు మండల కేంద్రంలో గల ఎంపిడిఓ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల కారణంగా రబీ సీజన్ లో తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలను పండించాలని, వేసవి సమయంలో త్రాగునీటి అవసరాలకు ఇబ్బంది కలగకుండా ముందు చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. తుంగతుర్తి ప్రాంతంలోని రైతులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా పంట మార్పిడి చేసుకోవాలని, వరి పంట లాంటి నీటి వినియోగం అధికంగా ఉన్న పంటలను కాకుండా తక్కువ నీటితో తక్కువ కాలంలో కోతకు వచ్చే పంటలను సాగు చేయాలని తెలిపారు. బైట్స్: మందుల  సామెల్, ఎమ్మెల్యే

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.