xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'నేటి నుంచి మరో 7 జిల్లాల్లో 'తొలిముద్ద' పథకం అమలునేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్1,500 నాణేలతో నామినేషన్.. అధికారులను ఆశ్చర్యపరిచిన స్వతంత్ర అభ్యర్థి!గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్జడ్పీ, ఎంపీపీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్₹1500కోట్ల క్లబ్‌లోకి 'రామాయణ'
ఆంధ్రప్రదేశ్

అల్లూరి జిల్లాలో గిరిజన సంక్షేమ అభివృద్ధి పనులపై ప్రధాన కార్యదర్శి సమీక్ష

19-11-2026 09:38
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి డి. మురళీధర్ రెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం పర్యటించారు.
xPress24, Paderu, November 18, పాడేరు, నవంబర్ 18: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి డి. మురళీధర్ రెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి పనులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని 108, 104 అంబులెన్స్ సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న గిరిజన సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సరఫరా, విద్య, వసతి గృహాల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అంబులెన్స్ సేవలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 108, 104 అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, వైద్య పరికరాల లభ్యతను స్వయంగా పరిశీలించారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు అంబులెన్స్‌లు సకాలంలో చేరుకుంటున్నాయా? గర్భిణులు, అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులను తరలించడంలో ఎదురవుతున్న సమస్యలేమిటి? అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్లు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి డి. మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలకు సైతం అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండాలని, ఏ ఒక్క గర్భిణి లేదా రోగి సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు పడకూడదని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులకు సూచించారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.