తెలంగాణ
అసాంఘికశక్తులకు గోదావరిఖని డీసీపీ హెచ్చరికలు
24-11-2026 12:13

పెద్దపల్లి జిల్లాలో రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంచుతామని డీసీపీ రామిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ప్రశాంతమైన జీవనానికి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలో సింగరేణి ఉద్యోగి హత్య కేసును పోలీసులు చేధించగా ఆయన అభినందించారు.
xPress24, Ramagundam, November 24,
సోమవారం గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలో సింగరేణి ఉద్యోగి రాజశేఖర్‌ను పాత కక్షల నేపథ్యంలో నలుగురు యువకులు హత్య చేశారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసులు నిందితులైన ఎన్నం ప్రసాద్, ఎడవల్లి శ్రావణ్, అయిలీ దేవేందర్, బోర మల్లేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన ఆటో, కత్తితో పాటు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన పెద్దపల్లి జిల్లా డీసీపీ రామిరెడ్డి ... హత్య కేసు వివరాలు వెల్లడించారు.
సింగరేణి ఉద్యోగి హత్య కేసును తక్కువ సమయంలోనే ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ సిబ్బందిని డీసీపీ రామిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులపై నిరంతరం నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ రామిరెడ్డి స్పష్టం చేశారు.ప్రజల ప్రశాంతమైన జీవనానికి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బైట్- రామిరెడ్డి, డీసీపీ, పెద్దపల్లి