xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బాపట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికరాజ్యాంగ విలువలపై యువతకు అవగాహన కల్పించాలిరాజ్యాంగ విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజినేడే ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీశ్రీలంకతో సెమీఫైనల్ - కళ్లన్నీ వైభవ్ పైనేబాపట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికరాజ్యాంగ విలువలపై యువతకు అవగాహన కల్పించాలిరాజ్యాంగ విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజినేడే ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీశ్రీలంకతో సెమీఫైనల్ - కళ్లన్నీ వైభవ్ పైనే
తెలంగాణ

ఆదిలాబాద్ గోపాల కృష్ణ మఠంలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. 21 వేల దీపాలు వెలిగించిన మహిళలు

26-11-2026 11:57
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాల కృష్ణ మఠంలో 400 ఏళ్ల సంప్రదాయం ప్రకారం కాగడ హారతి కార్యక్రమం నిర్వహించారు. పండితుల శాంతి పూజ, గణపతి పూజ అనంతరం మహిళలు 21 వేల దీపాలను వెలిగించి దీపారాధన చేశారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ దీపోత్సవం నిర్వహించినట్లు భక్తులు తెలిపారు.
xPress24, Adilabad, November 24, కార్తీక పౌర్ణమి వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గోపాల కృష్ణ మఠంలో 400 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న కాగడ హారతి కార్యక్రమంలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మఠంలో ముందుగా పండితులు శాంతి పూజ, గణపతి పూజ నిర్వహించారు. నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళలు కలిసి 21 వేల దీపాలను వెలిగించి దీపారాధనలో పాల్గొన్నారు. మహిళలందరికీ నిర్వాహకులు ఉచితంగా పూజ సామాగ్రిని అందజేశారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దీపోత్సవం నిర్వహించాం: భక్తులు శివుని ఆశీస్సులతో ప్రజలంతా చల్లగా ఉండాలని దీపోత్సవం నిర్వహించినట్లు భక్తులు తెలిపారు. అందరూ ఏకతాటిపై ఉంటూ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్తీక మాసంలో తులసి వివాహం జరిపించడం విశిష్టమని పేర్కొన్నారు. ఈ ఏడాది గోపాల కృష్ణ మఠంలో 21 వేల దీపాలు వెలిగించి దీపారాధన చేసినట్లు భక్తులు వివరించారు. బైట్స్ యోగానంద సరస్వతి, పీఠాధిపతి

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.