xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌
తెలంగాణ

ఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధం

22-10-2026 11:44
పత్తి కొనుగోళ్లకు ఆదిలాబాద్ మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమయ్యింది. తేమ శాతం విషయంలో రైతులు నష్టపోకుండా చూస్తామని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
xPress24, Adilabad, October 22, పత్తి కొనుగోళ్లకు ఆదిలాబాద్ మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 4.37 ఎకరాల్లో పత్తిని సాగు చేయగా, సుమారుగా 35 లక్షల క్వింటాళ్ల వరకు పత్తి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 11 సీసీఐ, 31 జిన్నింగ్ కేంద్రాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది పత్తి క్వింటాలుకు మద్దతు ధర ఎనిమిదివేల నూటపది రూపాయలు కాగా, ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు నిర్ణయించింది. అంటే గత ఏడాదితో పోలిస్తే క్వింటాలుకు రూ. 557 పెంచడం జరిగింది. అయితే ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్ల పత్తి మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. పాజ్....... మార్కెటింగ్ శాఖ అధికారి గజానంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు పత్తి కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిపారు. తేమ శాతం విషయంలో రైతులు నష్టపోకుండా వారికి పూర్తి వివరాలు ముందుగానే తెలియజేస్తామన్నారు. కొనుగోళ్లకు సంబంధించి ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ కోసం కపాస్ కిసాన్ యాప్ వినియోగించాలని సూచించారు. పత్తి అమ్మకానికి ముందుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన కోరారు. 1. బైట్ : గజానన్, మార్కెటింగ్ శాఖ అధికారి 2. బైట్ : దత్తాత్రి, రైతు

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.