xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐకాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐ
తెలంగాణ

ఆదిలాబాద్‌లో ప్రత్యేక బాలల ప్రజావాణి... వినతులు స్వీకరించిన అధికారులు

17-11-2026 10:49
ఆదిలాబాద్‌లో ప్రత్యేక బాలల ప్రజావాణి... వినతులు స్వీకరించిన అధికారులు
బాలల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ప్రత్యేక బాలల ప్రజావాణి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన చిన్నారుల నుంచి విద్య, ఆరోగ్యం, ఉపకార వేతనాలు తదితర అంశాలపై అధికారులు వినతులు స్వీకరించారు.
xPress24, Adilabad, November 16, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రత్యేక బాలల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న చిన్నారులు తమ సమస్యలతో పాల్గొని వినతులు, ఫిర్యాదులు అందజేశారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, బాల్య వివాహాల నివారణ, ఉపకార వేతనాలు, ధ్రువపత్రాల జారీ తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరించారు. అప్పటికప్పుడే పరిష్కార మార్గాలు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి విద్యార్థులు, బాలల సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడే పరిష్కార మార్గం చూపేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. బైట్ - రాజేంద్ర ప్రసాద్, జిల్లా బాలల సంరక్షణ అధికారి, ఆదిలాబాద్ జిల్లా

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.