xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలుశ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం..మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లుగుంటూరులో మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టు ప్రారంభంస్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలుదళితుల హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్తా: ఎంపీ వంశీకృష్ణపుట్టపర్తిలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలుశ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం..మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లుగుంటూరులో మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టు ప్రారంభంస్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలుదళితుల హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్తా: ఎంపీ వంశీకృష్ణ
తెలంగాణ

ఆదిలాబాద్‌లో లాభసాటిగా టమాట సాగు

23-11-2026 15:42
ఆదిలాబాద్ జిల్లాలో సాగయ్యే ముఖ్యమైన కూరగాయ పంటల్లో టమాట ఒకటి. జిల్లాలో దాదాపు ఎనిమిది వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది.
xPress24, Adilabad, November 23, ఆదిలాబాద్ జిల్లాలో సాగయ్యే ముఖ్యమైన కూరగాయ పంటల్లో టమాట ఒకటి. జిల్లాలో దాదాపు ఎనిమిది వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. ముఖ్యంగా గుడిహత్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు. గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామం టమాట సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ పండించిన టమాట పొరుగున ఉన్న మహారాష్ట్రతో పాటు మన రాష్ట్రంలోని జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్ జిల్లాలకు ఎగుమతి అవుతోంది. ఆయా ప్రాంతాల వ్యాపారులు నేరుగా రైతుల వద్దకే వచ్చి టమాట కొనుగోలు చేస్తున్నారు. రైతులు క్రేట్ల లెక్కన విక్రయిస్తుండగా, ప్రస్తుతం ఒక్కో క్రేట్‌కు రూ. 450 నుంచి రూ. 500 వరకు ధర పలుకుతోంది. పాత పద్ధతిలో సాగు చేస్తే మొక్కలు నేలపై పరుచుకుని, కాయలు నేలకు తాకి దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనిని నివారించి దిగుబడిని కాపాడుకునేందుకు రైతులు 'స్టేకింగ్' పద్ధతిని ఎంచుకున్నారు. పొలంలో కర్రలు పాతి, వాటికి అడ్డంగా నైలాన్ లేదా సుతిలి తాడు కట్టి మొక్కలను వాటిపైకి పాకిస్తున్నారు. దీనివల్ల కాయలకు గాలి, వెలుతురు ధారాళంగా తగిలి నాణ్యమైన దిగుబడి వస్తోంది. ఈ ఏడాది ఎల్ నినో  ప్రభావంతో పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నప్పటికీ, టమాట పంట తమను కొంతమేర ఆదుకుందని రైతులు అంటున్నారు. వర్షాలు మరింత అనుకూలిస్తే ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చేదని అభిప్రాయపడుతున్నారు. బైట్స్.. రాథోడ్ గోవింద్, టమాట రైతు జ్ఞానేశ్వర్, టమాట రైతు రమేష్, టమాట రైతు డా. మల్లేష్, ప్రధాన శాస్త్రవేత్త శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన పరిశోధన స్థానం

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.