తెలంగాణ
ఆదివాసీ గూడేల్లో వైభవంగా దండారి ఉత్సవాలు
09-11-2026 15:34

అదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని ఆదివాసీ గూడేల్లో దండారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. డప్పుల మోతలు, కోలాటాలు, గుస్సాడీ నృత్యాలతో గిరిజన గ్రామాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆదివాసీలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. కొలబోడి కార్యక్రమంతో దండారి ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.
xPress24, HYDERABAD, November 9,