ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయి గుర్తింపు
10-11-2026 10:20

ప్రజలకు సమాన అవకాశాలు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, సామాజిక భద్రత వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ – 2026లో 28 రాష్ట్రాలకు గాను ఆంధ్రప్రదేశ్ రెండో ర్యాంకు సాధించింది. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్ విడుదల చేసిన ఈ నివేదికలో గోవా 0.68 స్కోరుతో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 0.66 స్కోరుతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. సిక్కిం, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ నివేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ప్రభుత్వం చేపడుతున్న పాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు సమాన అవకాశాలు, మెరుగైన సేవలు అందించేలా వినియోగించడమే ఈ సూచీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
xPress24, Amaravati, November 10,