ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్–రష్యా ప్రాంతీయ భాగస్వామ్యం
13-11-2026 10:02

ఆంధ్రప్రదేశ్–రష్యా మధ్య ప్రాంతీయ భాగస్వామ్యాలను పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలుగా మలుస్తామని ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ‘విశాఖ నుంచి కజాన్ వరకు.. ప్రాంతీయ భాగస్వామ్యాల నుంచి ప్రపంచ అవకాశాల దిశగా’ అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి గురువారం ప్రసంగించారు. భారత్–రష్యా మధ్య చిరకాల వ్యూహాత్మక స్నేహాన్ని ఆర్థిక, పారిశ్రామిక భాగస్వామ్యంగా మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. కీలక ఖనిజాలు, అణుశక్తి, తయారీ, ఓడరేవులు, కృత్రిమ మేధస్సు, సాంకేతిక రంగాల్లో ఇరు ప్రాంతాల మధ్య సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
xPress24, Visakhapatnam, November 13,