ఆంధ్రప్రదేశ్
ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
21-11-2026 09:42

కృష్ణా జిల్లా గూడూరు మండలం చిట్టిగూడూరు ప్రధాన రహదారి పక్కన రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం పరిశీలించారు.
xPress24, Machilipatnam, November 20,
మచిలీపట్నం, నవంబర్ 20:
కృష్ణా జిల్లా గూడూరు మండలం చిట్టిగూడూరు ప్రధాన రహదారి పక్కన రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం నాణ్యత, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం సేకరణకు చేస్తున్న ఏర్పాట్లపై ఆయన ఆరా తీశారు.
రైతు భరోసా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచులను ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు.