xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బాపట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికరాజ్యాంగ విలువలపై యువతకు అవగాహన కల్పించాలిరాజ్యాంగ విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజినేడే ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీశ్రీలంకతో సెమీఫైనల్ - కళ్లన్నీ వైభవ్ పైనేబాపట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికరాజ్యాంగ విలువలపై యువతకు అవగాహన కల్పించాలిరాజ్యాంగ విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజినేడే ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీశ్రీలంకతో సెమీఫైనల్ - కళ్లన్నీ వైభవ్ పైనే
ఆంధ్రప్రదేశ్

ఆలయ తొలగింపుపై మంత్రి స్పందన

24-11-2026 15:39
ఆలయ తొలగింపుపై మంత్రి స్పందన
తిరుపతి జిల్లాలోని రేణిగుంట ఆంజనేయస్వామి ఆలయ తొలగింపుపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఖండించారు. ఆలయం సుమారు 70 ఏళ్ల క్రితం నిర్మించిందని, వెయ్యేళ్ల చరిత్ర ఉందంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 2023లోనే భూసేకరణ అవార్డు జారీ అయిందని ఒక ప్రకటనలో తెలిపారు. పరిహారం కింద వచ్చిన 59 లక్షల 30 వేల రూపాయలను ఆలయం పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు చెప్పారు. వైదిక సంప్రదాయాల ప్రకారం బాలాలయం నిర్మించి, మూలవిరాట్‌ను ధాన్యాధివాసంలో భద్రపరిచిన తర్వాతే ఆలయాన్ని తొలగించారని వివరించారు. మిగిలిన స్థలంలో తిరిగి ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
xPress24, Tirupathi, November 24, తిరుపతి జిల్లాలోని రేణిగుంట ఆంజనేయస్వామి ఆలయ తొలగింపుపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఖండించారు. ఆలయం సుమారు 70 ఏళ్ల క్రితం నిర్మించిందని, వెయ్యేళ్ల చరిత్ర ఉందంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 2023లోనే భూసేకరణ అవార్డు జారీ అయిందని ఒక ప్రకటనలో తెలిపారు. పరిహారం కింద వచ్చిన 59 లక్షల 30 వేల రూపాయలను ఆలయం పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు చెప్పారు. వైదిక సంప్రదాయాల ప్రకారం బాలాలయం నిర్మించి, మూలవిరాట్‌ను ధాన్యాధివాసంలో భద్రపరిచిన తర్వాతే ఆలయాన్ని తొలగించారని వివరించారు. మిగిలిన స్థలంలో తిరిగి ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.