xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేకృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
తెలంగాణ

ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, 2.30 కోట్ల జారీయే లక్ష్యం

20-11-2026 11:47
పెన్షనర్ల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచి 30 వరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ 5.0 క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. స్మార్ట్‌ఫోన్ ఫేస్ ఆథెంటికేషన్‌తో పాటు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో 2.30 కోట్ల సర్టిఫికెట్ల జారీయే లక్ష్యంగా చర్యలు చేపట్టారు.
xPress24, HYDERABAD, November 20, పెన్షనర్లు ప్రతి ఏటా బ్యాంకులకు వెళ్లి సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ 5.0 క్యాంపెయిన్‌ను చేపట్టింది. వరుసగా 5వ ఏడాది కొనసాగుతున్న ఈ కార్యక్రమం నవంబర్ 1 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా జరుగుతోంది. 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు అక్టోబర్ 1 నుంచే ఈ అవకాశం కల్పించారు. వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ ఆథెంటికేషన్‌తో క్షణాల్లోనే సర్టిఫికెట్ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ ఫేస్ ఆర్డీ, జీవన్ ప్రమాణ్ యాప్‌లను ఉపయోగించి ఆధార్ నంబర్, పీపీవో నంబర్, పెన్షన్ ఖాతా వివరాలను నమోదు చేసి ఫేస్ ఆథెంటికేషన్‌తో క్షణాల్లోనే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందవచ్చని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. సర్టిఫికెట్ జారీ కాగానే సంబంధిత పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీకి ఆన్‌లైన్‌లో చేరుతుందని వివరించారు. రైల్వే నిలయంతో పాటు డివిజనల్ హెడ్‌క్వార్టర్స్, వర్క్‌షాప్‌లలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని, బయటకు రాలేని వృద్ధులకు సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. గత ఏడాది 1.50 కోట్ల సర్టిఫికెట్లు జారీ కాగా, ఈ ఏడాది 2.30 కోట్ల సర్టిఫికెట్ల జారీయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. బైట్ - శ్రీధర్, దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.