xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షమున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
జాతీయం

ఇండి కూటమి చేపట్టిన నిరసనల్లో పాల్గొనండి.. షాపింగ్ కూడా చేయండి: రాహుల్ గాంధీ

02-11-2026 09:49
దిల్లీ రాంలీలా మైదానంలో ఇండి కూటమి చేపట్టిన మెగా ర్యాలీకి వచ్చే ప్రజలు నిరసనలతో పాటు స్థానిక చిన్న దుకాణాల్లో షాపింగ్ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పండుగల వేళ ర్యాలీ వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. స్థానిక వ్యాపారులకు మద్దతుగా కొనుగోళ్లు జరపాలని కోరారు.
xPress24, Delhi, November 1, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ రాంలీలా మైదానంలో ఇండి కూటమి చేపట్టిన భారీ ర్యాలీకి హాజరవుతున్న కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనలో పాల్గొంటూనే స్థానిక చిన్న వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు షాపింగ్ కూడా చేయాలని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. చిన్న వ్యాపారులను ఆదుకోవాలి దీపావళి, ఛట్ పూజ, భాయ్ దూజ్ పండుగల సమయంలో ఈ ర్యాలీ వల్ల స్థానిక వ్యాపారాలు దెబ్బతింటాయంటూ బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాంలీలా మార్చ్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు దిల్లీకి తరలివస్తున్నారని తెలిపారు. బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా నిరసనకారులు స్థానిక మార్కెట్లు, చిన్న దుకాణాల్లో వస్తువులను కొనుగోలు చేసి చిరు వ్యాపారులకు అండగా నిలవాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం మార్చ్ చేస్తూనే, ఆర్థికంగా చిన్న వ్యాపారులకు తోడ్పడాలని స్పష్టం చేశారు. బైట్ రాహుల్ గాంధీ, ఎంపీ

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.