xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై మార్మోగిన ‘జై భవాని’ నామస్మరణ

22-10-2026 15:59
ఇంద్రకీలాద్రిపై మార్మోగిన ‘జై భవాని’ నామస్మరణ
ఇంద్రకీలాద్రిపై ‘జై భవాని.. జై జై భవాని’ నామస్మరణ మార్మోగింది. కనకదుర్గమ్మ దర్శనానికి గురువారం ఉదయం భవానీ దీక్షాపరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
xPress24, Vijayawada, October 22, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ‘జై భవాని.. జై జై భవాని’ నామస్మరణ మార్మోగింది. కనకదుర్గమ్మ దర్శనానికి గురువారం ఉదయం భవానీ దీక్షాపరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దీక్షా వస్త్రాలు ధరించి క్యూ లైన్లలో బారులు తీరడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. భవానీ దీక్షాపరులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) వీకే శీనా నాయక్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీటితోపాటు వేడి పాలు అందించేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని వినాయకుడి ఆలయం నుంచి ఘాట్‌ రోడ్డు మీదుగా వచ్చే వారికి, భవానీపురం వైపు నుంచి కుమ్మరిపాలెం సెంటర్‌ మీదుగా వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. క్యూ లైన్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు భక్తులు సౌకర్యవంతంగా ముందుకు సాగేలా చర్యలు చేపట్టారు. ఈవో శీనా నాయక్‌ ఎప్పటికప్పుడు రద్దీ పరిస్థితులను సమీక్షిస్తూ, భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.