జాతీయం
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సన్నాహక సదస్సు
30-10-2026 09:55

కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యాల దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు.ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి గురువారం పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలనే లక్ష్యంలో తెలంగాణ 10 శాతం వాటా అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. రాష్ట్రానికి రెండు కొత్త విమానాశ్రయాలను కేంద్రం మంజూరు చేసిందని వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపుగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
xPress24, New Delhi, October 30,