ఆంధ్రప్రదేశ్
ఇఫీ ‘పేజ్ సే పిచ్ తక్’ కార్యక్రమం
23-11-2026 10:32

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక అనుభవాల ఆధారంగా రూపొందే మౌలిక కథలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రముఖ నటులు మనోజ్ జోషి అన్నారు.గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం -ఇఫీలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖలోని ప్రసార భారతి చేపట్టిన ‘పేజ్ టు పిచ్’ కార్యక్రమానికి జ్యూరీ సభ్యునిగా వ్యవహరిస్తున్న ఆయన ఆల్ ఇండియా రేడియో న్యూస్‌తో మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా యువ రచయితలు తమ ప్రాంతాలకు చెందిన కథలను వెండితెరపైకి తీసుకువచ్చేందుకు ప్రోత్సాహం లభిస్తుందని మనోజ్ జోషి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న ప్రస్తుత తరుణంలో, ఇతరుల కథలను అనుకరించడం కాకుండా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అసలైన కథలను తెరకెక్కించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
xPress24, Panaji, November 23,