జాతీయం
ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
31-10-2026 12:51

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్18 రాకెట్ ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఎక్స్ వేదికగా ప్రత్యేక అభినందనలు తెలిపారు.
xPress24, Delhi, October 31,
ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్18 రాకెట్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం, అసాధారణ మేధస్సు దేశానికే గర్వకారణమని ప్రధాని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు ఆయన అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నేవిగేషన్ సేవలకు ఈ ఉపగ్రహం మద్దతు అందిస్తుంది అని మోదీ తెలిపారు.
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం రాత్రి 11.51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత ఎన్‌వీఎస్-03 నేవిగేషన్ ఉపగ్రహం నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి చేరింది. సొంత నేవిగేషన్ వ్యవస్థ నావిక్ సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రయోగ ప్రధాన ఉద్దేశం.