xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.
తెలంగాణ

ఈ నెల 28న కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవం.. గవర్నర్ ప్రతాప్ శుక్ల హాజరుకానున్నట్లు వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి వెల్లడి

27-11-2026 09:32
ఈ నెల 28న ఉదయం 11 గంటలకు కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్, ఛాన్స్‌లర్ ప్రతాప్ శుక్ల హాజరుకానున్నారు. 2021-25 మధ్య డిగ్రీ పూర్తి చేసిన 1,33,695 మంది విద్యార్థులకు పట్టాలు, 408 బంగారు పతకాలతో పాటు 91 మందికి పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేయనున్నట్లు వీసీ తెలిపారు.
xPress24, WARANGAL URBAN, November 26, ఈ నెల 28న కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్స్‌లర్ ప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ సెనేట్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గవర్నర్ స్నాతకోత్సవ వివరాలను వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు స్నాతకోత్సవ వేడుకలు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ముగుస్తాయని వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. 1,33,695 మందికి డిగ్రీ పట్టాలు.. 408 బంగారు పతకాలు, 91 మందికి పీహెచ్‌డీ ప్రదానం 2021 నుంచి 2025 వరకు నాలుగు సంవత్సరాల కాలంలో డిగ్రీ పూర్తి చేసుకున్న మొత్తం 1,33,695 మంది విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నట్లు ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి వివరించారు. పట్టాలు అందుకుంటున్న వారిలో బాలికలు 65 శాతం ఉండగా, బాలురు 35 శాతం ఉన్నారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 408 బంగారు పతకాలను (గోల్డ్ మెడల్స్) అందజేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా, 2024 నుంచి 2026 మధ్య కాలంలో అవార్డు అయిన 91 మంది పరిశోధకులకు పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేయనున్నట్లు వీసీ వెల్లడించారు. బైట్స్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి, వైస్ ఛాన్స్‌లర్, కాకతీయ విశ్వవిద్యాలయం

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.