తెలంగాణ
ఈ-శ్రమ్‌తో సామాజిక భద్రత : జి.కిషన్ రెడ్డి
05-11-2026 10:06

అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 14 నాటికి తెలంగాణలో 47 లక్షల 21 వేల 780 మందికి పైగా అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నిన్న వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో 3 లక్షల 84 వేల 770 మందికి పైగా కార్మికులు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ-శ్రామ్ కార్డుదారులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షల రూపాయలు, పాక్షిక వైకల్యం ఏర్పడితే లక్ష రూపాయల బీమా కవరేజీ లభిస్తుందని వివరించారు.అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంలో ఈ-శ్రమ్ కీలకంగా మారిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
xPress24, Hyderabad, November 5,