అంతర్జాతీయం
ఈజిప్ట్‌లో ఘోర రైలు ప్రమాదం.. 8 మంది మృతి
09-11-2026 15:32
ఈజిప్ట్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గిజా ప్రావిన్స్ లో ఎల్-అయ్యాత్ సమీపంలో ఒకే రైల్వే ట్రాక్ పై రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 112 మందికి గాయాలు అయ్యాయి.
xPress24, EGypt, November 9,
ఈజిప్ట్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గిజా ప్రావిన్స్ లో ఎల్-అయ్యాత్ సమీపంలో ఒకే రైల్వే ట్రాక్ పై రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 112 మందికి గాయాలు అయ్యాయి. రెండు రైళ్లు ఢీకొనడంతో పలు బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడ్డాయి.
కైరో నుంచి ఆస్వాన్కు వెళుతున్న రైలును గిజా నుంచి ఫయోమ్కు వెళుతున్న రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ఈజిప్ట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది క్షతగాత్రులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
72 అంబులెన్సుల ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. గాయపడిన వారిలో 49 మందిని ఎల్-వాస్తా ఆసుపత్రికి, 29 మందిని ఎల్-అయ్యత్ ఆసుపత్రికి, 10 మందిని అత్ఫిహ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తునకు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.